ఇంటి నుంచి అదృశ్యమై మరణించిన వృద్ధుడు - కాజీపేట
ఇంటి నుంచి తప్పిపోయిన ఓ వయోవృద్ధుడు మృత్యవాత పడ్డాడు. కాజీపేట విష్ణుపురికి చెందిన రావుల రాంనారాయణ అనే వృద్ధుడు ఈ నెల 14న తప్పిపోయాడు. కుమారుల ఫిర్యాదుతో వెతికిన పోలీసులకు సోమవారం నాడు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రీన్‌సిటీ వెంచర్లో కుళ్లిన మృతదేహం కనబడింది. ఆ మృతదేహం రావుల రాంనారాయణదిగా మృతుడి బంధువులు తెలిపారు.
మరణించిన వయోవృద్ధుడు
ఇవీ చూడండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతి