తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రకాళి ఆలయంలో నిరాడంబరంగా కల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రకాళి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. కరోనా ఉద్ధృతి, లాక్​డౌన్​ నేపథ్యంలో ఉత్సవాలను అర్చకులు ఏకాంతంగా జరుపుతున్నారు.

Kalyana Brahmotsavam at Bhadrakali Temple
Kalyana Brahmotsavam at Bhadrakali Temple

By

Published : May 17, 2021, 6:08 PM IST

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. లాక్​డౌన్ కారణంగా ఉత్సవాలను అర్చకులు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఉత్సవాలను ఏకాంతంగా జరుపుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమశాస్త్ర సామ్రాట్ శేషు తెలిపారు.

ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు…. అనంతరం అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం భద్రకాళి, భద్రీశ్వరముల కల్యాణం నిర్వహించనున్నారు. అంతకు ముందుగా శంకర జయంతి సందర్భంగా అర్చకులు ఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ABOUT THE AUTHOR

...view details