. ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా కాజీపేటలో చోటు చేసుకుంది. కాజీపేట దర్గాకు చెందిన భాను కిరణ్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు తప్పాడు. బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరు స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇంటర్లో తప్పాడు.. ప్రాణాలు తీసుకున్నాడు.. - ఇంటర్ విద్యార్థులు
ఇంటర్ పరీక్షలో ఫెయిలయ్యాననే మనస్తాపంతో వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన భానుకిరణ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.
ఇంటర్ ఫెయిలై విద్యార్థి బలవన్మరణం