ఈనెల 29న వరంగల్‌లో తెరాస నిర్వహించ తలపెట్టిన విజయ గర్జన సభ(Trs Vijayagarjana)కు తమ భూములు ఇవ్వమని దేవన్నపేట రైతులు (Devannapeta Farmers)ఆందోళన చేపట్టారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో ఉన్న వ్యవసాయ భూముల్లో విజయగర్జన సభ నిర్వహించేందుకు అధికార తెరాస ప్రణాళికలు వేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది రైతులు ఒప్పకోవడం లేదు. పంటలు పండే భూములను మేము ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు.
Trs Vijayagarjana: 'తెరాస సభ కోసం మా భూములు నాశనం చేసుకోవాలా? ఇచ్చేదే లేదు..'
తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన (Trs Vijayagarjana) సభకు తమ భూములు ఇవ్వమంటూ హనుమకొండ జిల్లా రైతులు తెగేసి చెబుతున్నారు. సభ కోసం తమ భూములను నాశనం చేసుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
సభాస్థలి పరిశీలన కోసం వచ్చిన తెరాస నాయకులు, అధికారులు, పోలీసులతో రైతులు గొడవకు దిగారు. సభకు తమ భూములు ఇవ్వమని రైతులు స్పష్టం చేశారు. పంట పొలాల భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పంటలు పండే భూముల్లో సభ నిర్వహించవద్దని రైతులు వేడుకుంటున్నారు. సిటీకి దగ్గర ఉన్నందున మేము కూరగాయలు పెట్టుకున్నామని ఒక రోజు సభ కోసం మా పంట భూములను నాశనం చేస్తారా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెరాస నేతలు వేరే ఖాళీ ప్రదేశాల్లో సభ పెట్టుకొవాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: