తెలంగాణ

telangana

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి కల్యాణ మహోత్సవం

By

Published : Oct 27, 2020, 12:32 AM IST

ఓరుగల్లులోని భద్రకాళి అమ్మవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

goddess bhadrakali marriage in warangal bhadrakali temple
కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి కల్యాణ మహోత్సవం

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారు... అమ్మవారికి మాంగళ్యధారణ చేశారు.

మంగళవాద్యాల నడుమ అమ్మవారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు.

ఇదీ చూడండి:కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం

ABOUT THE AUTHOR

...view details