వరంగల్‌కు అభివృద్ధికి తెరాస చేసింది ఏమీలేదని మాజీ మంత్రి కొండ సురేఖ విమర్శించారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
వరంగల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: కొండా సురేఖ - తెలంగాణ తాజా వార్తలు
గత కార్పొరేటర్లు... భూ కబ్జాలు, అక్రమ దందాలే తప్పా వరంగల్ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి ఏమి లేదని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. జీడబ్యూఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొని ఓటు అభ్యర్థించారు.
తెలంగాణ వార్తలు
వరంగల్‌లో కొండా దంపతులను ఎదుర్కొనే సత్తా తెరాసకు లేదన్నారు. ఇక నుంచి జిల్లా రాజకీయాల్లో కొండా శకం మొదలైందని.... వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:సంక్షేమ పథకాలే తెరాసను గెలిపిస్తాయి: చల్లా ధర్మారెడ్డి