కాంగ్రెస్, భాజపాలను చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తెరాసకు అత్యధిక స్థానాలు వస్తాయని... అందులో సగం కూడా విపక్షాలు గెలుచుకోగలవా..? అంటూ సవాలు విసిరారు.
'9 పురపాలికల్లో గెలిచి కేసీఆర్, కేటీఆర్కు కానుకగా ఇస్తా'
వరంగల్లో 9 మున్సిపాలిటీలను గెలిచి కేసీఆర్, కేటీఆర్కు బహుమతిగా ఇస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఒక పైసా నిధులు ఇవ్వని భాజపా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.
'9 పురపాలికల్లో గెలిచి కేసీఆర్, కేటీఆర్కు కానుకగా ఇస్తా'
వరంగల్ జిల్లాలో 9 పురపాలికల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్... మంత్రి కేటీఆర్కు కానుకగా ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమాగా చెప్పారు. తొర్రూరు పురపాలికలోని 15, 16వార్డుల్లో తెరాస అభ్యర్థుల తరపున మంత్రి... ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరించి ఓట్లు అభ్యర్థించారు.
ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్