elkathurthy police: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా తరచూ ద్విచక్ర వాహనదారులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు రహదారికి మరమ్మత్తులు చేయించాలని నేషనల్ హైవే అథారిటీ వారికి పలుమార్లు తెలియచేశారు.
గుంతలు పూడ్చారు.. రహదారి బాగుచేశారు.. ఎల్కతుర్తి పోలీసుల సేవకు సర్వత్రా ప్రశంసలు..
elkathurthy police: పోలీసులంటే శాంతి భద్రతలు కాపాడడమే కాకుండా ప్రజలకు తమ వంతు సాయం చేయాలనే సేవాగుణం కలిగినవారు ఉంటారని చాటుకున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జాతీయ రహదారిపై ఏర్పడిన ప్రమాదకర గుంతల్లో తరుచూ ద్విచక్ర వాహనదారులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నా విషయాన్ని వారు గుర్తించారు. దాతల సాయంతో గుంతలను సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చివేయించి తమ సేవ దృక్పథాన్ని చాటుకున్నారు.
గుంతలు పూడ్చివేయిస్తున్న పోలీసులు
వారి నుంచి స్పందన రాకపోవడంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో రహదారిపై ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చి వేశామని ఏసీపీ తెలిపారు. తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్న ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్, ఎస్సై పరమేశ్వర్లును ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు.
ఇదీ చదవండి:Mirchi prices in Enumamula market : ఎర్రబంగారం రికార్డు ధర.. క్వింటా@ రూ.32 వేలు