వ్యర్థ శుద్ధీకరణ కేంద్రానికి రంగం సిద్ధం ఓరుగల్లులో రోజు 300 మెట్రిక్ టన్నుల మేర చెత్త వస్తోంది. కాలువలు, రహదారులు ఇతర ఖాళీ ప్రదేశాల్లోని వ్యర్థాలను పరిగణలోకి తీసుకుంటే 500 మెట్రిక్ టన్నులు అవుతుంది. చెత్త నుంచి విముక్తి కలిగించేందుకు 2017లో మాజీ మంత్రి కేటీఆర్ టోక్యోలో పర్యటించి...శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జపాన్ బృందం సభ్యులు రెండుసార్లు పర్యటించి చెత్త డంపింగ్, నగర కాలుష్యంపై వివరాలు సేకరించారు. శుద్ధీకరణ ప్లాంట్ ఏర్పాటుకు వరంగల్ అనువైనదిగా తేల్చారు.
వ్యర్థ శుద్ధీకరణ కేంద్ర ఏర్పాటుకు 500 కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయి. ప్రతిరోజూ 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాల శుద్ధితోపాటు 7500 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అధికారులు ఆలస్యం చేయకుండా త్వరగా చెత్తశుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తే..చారిత్రక ఓరుగల్లు నగరం పరిశుభ్ర నగరంగా చరిత్ర సృష్టించనుంది.