కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆర్నెళ్లుగా నిలిపివేసిన సాధారణ శస్త్రచికిత్సలను ఈనెల 12 నుంచి తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.
ఎంజీఎం ఆసుపత్రిలో తగ్గిన కరోనా కేసులు.. సాధారణ సేవలు పునఃప్రారంభం
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఆసుపత్రి కార్యనిర్వహణాధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. ఆర్నెళ్లుగా నిలిపివేసిన సేవలను ఈనెల 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఎంజీఎం ఆసుపత్రిలో తగ్గిన కరోనా కేసులు..
ఆసుపత్రిలో ప్రత్యేకంగా 440 కరోనా పడకలుండగా.. ప్రస్తుతం 320 ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అన్ని విభాగాలు కలుపుకుని 640 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 6,300 కొవిడ్ నమూనాలు సేకరించగా.. 2,650 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు. 18వేల మంది ఔట్పేషంట్లు రాగా.. 2,369 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు నాగార్జున రెడ్డి తెలిపారు.