తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Election Campaign in Warangal : ఓరుగల్లులో కారు జోరు.. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం షురూ

BRS Election Campaign in Warangal తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థులు అప్పుడే ప్రచారం షురూ చేశారు. ప్రజల్లోకి వెళ్లి.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచార జోరును పెంచేసింది. వరుస సమావేశాలు.. సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 11:15 AM IST

BRS Candidates Campaign
BRS Candidates Campaign in Warangal

BRS Election Campaign in Warangal ఓరుగల్లులో కారు జోరు.. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం షురూ

BRS Election Campaign in Warangal :గతంలో లాగా అభ్యర్థుల్ని ముందే ప్రకటించి బీఆర్​ఎస్​ ఎన్నికల(Telangana Assembly Elections 2023) సమర శంఖారావం పూరించింది. అసంతృప్తులున్న చోట బుజ్జగింపుల పర్వం నడుస్తుండగా మిగతా ప్రాంతాల్లో ప్రచారంమొదలు పెట్టింది. నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ, గులాబీ శ్రేణులను కదనరంగానికి సన్నద్ధం చేస్తోంది. ఎక్కడికక్కడ అభ్యర్థులు మరోసారి గెలవాల్సిన ఆవశ్యతను నొక్కి చెబుతున్నారు.

BRS Public Meeting in Warangal : విపక్షాల కన్నా ముందే అభ్యర్థులు ఖరారవటంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని బీఆర్​ఎస్​ నేతలు(BRS MLA Candidates campaign) ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాల్లో చేసిన అభివృద్ధిని పేర్కొంటూ మళ్లీ గెలవాల్సిన ఆవశ్యకతను పార్టీ శ్రేణులకు వెల్లడిస్తున్నారు.

Warangal BRS Campaign 2023 :ములుగు జిల్లాలో బీఆర్​ఎస్​ అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Nagajyothi) తరపున నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. జిల్లా మరింత అభివృద్ధి సాధించాలంటే కారు పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. ఇటు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బడే నాగజ్యోతి ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. కొంగు చాచి ఓట్లు అడగుతున్నానని వివరించారు.

BRS MLA Candidates Second List 2023 : కొలిక్కివచ్చిన BRS ఎమ్మెల్యే అభ్యర్థుల​ తుది జాబితా.. ఒకట్రెండు రోజుల్లో ఉత్కంఠకు తెర..!

"అతి చిన్న వయస్సురాలైన నాకు ఈ బాధ్యత అప్పజెప్పారు. కానీ ఇది నా ఒక్కదానిది కాదు.. మనందరి బాధ్యత. ప్రతి ఇంట్లో ఏ కష్టం ఉందో నాకు తెలుసు. నేను వాటిని చూస్తున్నాను.. అనుభవిస్తున్నాను. కచ్చితంగా ప్రతి ఇంటికి వచ్చి మీ సమస్యలను తెలుసుకుంటాను.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాను."- బడే నాగజ్యోతి, ములుగు బీఆర్​ఎస్​ అభ్యర్థి

BRS Election Campaign Telangana 2023 : ప్రభుత్వ విప్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గ సమావేశం నిర్వహించారు. వచ్చే 3 నెలలు అలుపెరగకుండా పనిచేసి విజయభేరి (MLA Vinay Bhaskar Reddy) మోగించాలని పిలుపునిచ్చారు. దొంగే దొంగ అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తన మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దని వినయ్ భాస్కర్ హెచ్చరించారు.

"మా పార్టీ నాయకుల దగ్గరకి రాకండి. మేము చిత్తశుద్ధితో నిబద్దతో ప్రజలకు సేవ చేస్తున్నాం. మా దగ్గరికి వస్తే ఊరుకోం రాళ్లతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. కార్యకర్తలకు, అన్నదమ్ములకు.. అక్కజెల్లెల్లకు అందరికి చెబుతున్నా.. ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు కానీ మీరు నిలకడగా ఉండాలి." - వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే

జిల్లాలో టిక్కెట్లు పొందిన పలువురు సిట్టింగ్ అభ్యర్థులు సైతం వచ్చే వారంలో సమావేశాలు జరిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల సమరానికి కార్యకర్తలను సిద్ధం చేసేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ప్రచారాలు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ

BRS MLA Candidates List 2023 : 14 మంది మంత్రులకు సిట్టింగ్ స్థానాలు ఖరారు.. గజ్వేల్​ నుంచే కేసీఆర్ పోటీ!

ABOUT THE AUTHOR

...view details