తెలంగాణ

telangana

ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు.. పడకల సంఖ్య పెంచిన అధికారులు!

కొవిడ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. వరంగల్ ఎంజీఎంలో జిల్లా వైద్యాధికారులు పడకల సంఖ్యను పెంచారు. ఇప్పటి వరకు ఉన్న పడకలకు అదనంగా మరో వంద పడకలను వైద్యులు సిద్ధం చేశారు. వైరస్ బారిన పడినవారు త్వరగా కోలుకునేలా నాణ్యమైన వైద్యం, పోషకాహారం అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని వైద్యం చేయగల సదుపాయాలు ఎంజీఎంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

Beds Increased In Warangal MGM Hospital
పెరుగుతున్న కరోనా కేసులు.. పడకల సంఖ్య పెంచిన అధికారులు!

By

Published : Sep 20, 2020, 6:42 PM IST

వరంగల్ ఉమ్మడి జిల్లా​లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య... రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వరంగల్ అర్బన్ జిల్లాలో రోజుకు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా... ఇప్పటి వరకు 25 వేల కేసులు నమోదు కాగా... అర్బన్ జిల్లాలో అధికంగా... పదివేల కేసులు వెలుగుచూశాయి. పట్టణాలతో పాటు... పల్లెల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండం వల్ల... వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు.కొవిడ్ రోగుల కోసం ప్రస్తుతం 400 పడకలు... సిద్ధంగా ఉంచామని ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునా రెడ్డి తెలిపారు.

పాజిటివ్​ సోకిన బాధితులు త్వరగా కోలుకునేలా సమయానికి వైద్యం అందిస్తూనే.. రోగ నిరోధకశక్తి పెరిగేలా పోషకాహారం, ఖరీదైన మందులు ఇస్తున్నట్లు తెలిపారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సమస్యలు కానీ... ఇతరత్రా పరికరాల కొరత ఎంజీఎంలో లేదని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. శ్వాస సమస్యలతో వచ్చేవారిని నేరుగా ప్రత్యేక వార్డుకు పంపిస్తున్నారు. వారికి పాజిటివ్​గా వస్తే.. చుట్టుపక్కల వారికి వైరస్​ వ్యాపించకుండా వెంటనే వారిని కరోనా వార్డుకు తరలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం వరంగల్​ ఎంజీఎంలో పేషెంట్ల కంటే పడకలే ఎక్కువగా ఉన్నాయని.. ఇతర సాంకేతక వైద్య సహాయం కూడా సిద్ధం చేశామని సూపరింటెండెంట్ నాగార్జునా రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:చాలా రోజుల తర్వాత యాదాద్రిలో భక్తుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details