పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి - warangal latest new
11:52 March 01
పట్టణ ప్రగతి పనుల్లో అపశ్రుతి.. ఐదేళ్ల పాప మృతి
అధికారుల నిర్లక్ష్యం పసి ప్రాణాన్ని బలిగొంది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోడ్‌లోని హనుమాన్‌నగర్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా జేసీబీతో మురికి కాలువలు శుభ్రం చేస్తుండగా పక్కన ఉన్న గోడ కూలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ప్రిన్సి అనే 7 సంవత్సరాల పాప అక్కడిక్కడే మృతి చెందగా పాప తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. బాబును ఎంజీఎం ఆస్పపతి తరలించి చికిత్స అందిస్తున్నారు.
డ్రైవర్ అజాగ్రత్తగా జేసీబీ నడపడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు. మృతరాలి తండ్రి సాంబశివరావు వండ్రంగి పని చేస్తూ స్థానికంగా అద్దెకు ఉంటున్నారు. పిల్లలతో కలిసి బయటకు వెళ్లి చేపలు తీసుకుని ఇంటి లోపలికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:దిల్లీ పాఠశాలలకు సెలవుల పొడిగింపు- పరీక్షలు వాయిదా