రోగ నిర్ధరణలో ముఖ్య పాత్రను పోషించే ఎక్స్‌రే యంత్రాలు అన్నీ పనిచేయడం లేదు. ఫలితంగా ఉన్న యంత్రాలపై పనిభారమంతా పడి అవి కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం వెయ్యి పడకల ఆసుపత్రిలో ప్రత్యేక రేడియాలజీ విభాగం ఉంది. హెచ్‌వోడీతోపాటు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రేడియోగ్రాఫర్లు, టెక్నిషియన్లు సుమారు 14 మంది వరకు సేవలందిస్తున్నారు.
రోజూ ఓపీ వైద్య విభాగంలో 2,500 మంది రోగులు వైద్యసేవలు పొందుతుంటారు. వీరిలో కనీసం 200 మందికి వైద్యులు ఎక్స్‌రే తీయించుకోవాలని సూచిస్తారు. వీరితో పాటు ప్రతిరోజు అత్యవసర వైద్యవిభాగం క్యాజువాలిటీలో మెడికల్ లీగల్ కేసులు సుమారు 150 మందికి ఎక్స్‌రే పరీక్షలు చేస్తారు. అత్యవసర కేసులు 50 నుంచి 100వరకు వస్తాయి. ఇలా ఆ విభాగం ప్రతిరోజు రద్దీగా ఉంటుంది.
క్యాజువాలిటీ అత్యవసర విభాగంలో ఒక యంత్రం పనిచేసుండగా, ప్రస్తుతం ఎంజీఎంలో ఉన్న డిజిటల్ ఎక్స్‌రే యంత్రంపైనే ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నారు. ఇలాగే ఒకటి రెండు యంత్రాలపై సేవలు కొనసాగిస్తే వాటిపై భారంపడి పనిచేయనట్లయితే రోగనిర్ధరణ పరీక్షలు నిలిచిపోతాయి. యంత్రాలన్నీ పనిచేస్తుంటే అత్యవసర పరిస్థితుల్లో వందలమంది క్షతగాత్రులు వచ్చినా రోగనిర్ధారణ పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రతి రోజూ పరీక్షల వివరాలు
● ఓపీ, ఐపీ ఎక్స్‌రేలు: 200
● క్యాజువాలిటీలో : 150