తెలంగాణ

telangana

ETV Bharat / state

143 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేశ్ - kalyana lakshmi

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు.

143 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేశ్
143 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేశ్

By

Published : Sep 5, 2020, 7:02 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 143 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పంపిణీ చేశారు. సుమారు కోటి 39 లక్షల 43వేల 356 రూపాయల విలువైన చెక్కులను అందించారు.

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రమేశ్

సీఎం సహాయనిధి ద్వారా...

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8 మందికి 2 లక్షల రూపాయల చెక్కులను సైతం అందజేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రమేశ్

ఇవీ చూడండి : టీచర్ల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details