వరంగల్ గ్రామీణ జిల్లా ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి... ఆస్పత్రిలో అసౌకర్యాలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరింగ్ టైల్స్ పగిలి ఉండటం చూసి అసహనం వ్యక్తం చేశారు.
ఆస్పత్రి ఆవరణ ఇలాగేనా ఉండేది?
వరంగల్ గ్రామీణ జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం వల్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రి ఆవరణ ఇలాగేనా ఉండేది?
గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుట్టిన వారికి రూ.13వేల రూపాయలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కొంత మంది తమకు అందడం లేదని చెప్పగా.. సమగ్ర నివేదిక ఇవ్వాలని డ్యూటీ డాక్టర్లను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండటం చూసి సిబ్బందిపై మండిపడ్డారు.
- ఇవీ చదవండీ : అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!