నిండుకుండలా రామచంద్రుని చెరువు - cheruvuv
ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఇంకిపోతున్నాయి... కానీ అక్కడ మాత్రం చెరువు నిండుకుండలా తలపిస్తోంది. రైతులకు నేన్నానంటూ భరోసా ఇస్తోంది.
రామచంద్రుని చెరువు జలకళ
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రామచంద్రుని చెరువు నీటితో కళ కళలాడుతోంది. చెరువు నిండిందని రైతులు ఆనందంలో మునిగిపోయారు. సుమారు 1500 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుకు మిషన్ కాకతీయ పథకంలో పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం పెరిగింది. నాలుగు నెలల కిందట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గోదావరి జలాలతో నీటిని నింపించడం ద్వారా ఇప్పుడు జలకళ సంతరించుకుంది.