వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దామెర మండలంలోని ఊరుగొండ, సీతారాంపురం, తక్కళ్లపాడు గ్రామాల్లో రూ. 2.45 కోట్లతో తారురోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత లోపించకుండా జాతరలోగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే' - parakala mla
రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు.

'నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే'
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అనతి కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి గోదావరి జలాలతో రాష్ట్రాన్ని నింపిన ఘనత కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
'నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే'