వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండ మండలం ఆరేపల్లి శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ డీబీఎం 31 నుంచి నీటిని విడుదల చేశారు. దామెర క్రాస్ నుంచి నడికూడ, పరకాల వరకు మోటార్ సైకిల్ మీద కాలువను పరిశీలిస్తూ ప్రయాణించారు.
కాలువ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చల్లా - warangal rural district news
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండ మండలం ఆరేపల్లి శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ నుంచి ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు.

కాలువ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చల్లా
అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రాష్ట్రానికి అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
కాలువ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చల్లా
ఇదీ చూడండి : చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..