రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని ఖిలా వరంగల్, సంగెం మండలాల్లోని గ్రామాల మీదుగా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించారు.
'జూన్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు'
వరంగల్ గ్రామీణ జిల్లాలోని ఖిలా వరంగల్, సంగెం మండలాల్లో నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. గ్రామాల మీదుగా ద్విచక్రవాహనంపై ప్రయాణించి కార్యక్రర్తలను ఉత్సాహపరిచారు. జూన్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
'జూన్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు'
త్వరలో పూర్తికానున్న కాలువ నిర్మాణంతో వచ్చే జూన్ మాసంలో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పంట దిగుబడి రావటమే... కేసీఆర్కు రైతులపై ఉన్న ప్రేమను తెలిజేస్తుందన్నారు.