పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల పరిషత్ కార్యాలయంలో 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌ను గురువారం ప్రారంభించారు.
సొంత ఖర్చులతో అంబులెన్స్‌ను అందిస్తున్నాం: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం పర్యటించారు. తెరాస పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి క్షేత్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌ను ప్రారంభించారు.
సొంత ఖర్చులతో అంబులెన్స్‌ను అందిస్తున్నాం: మంత్రి ఎర్రబెల్లి
అనంతరం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. కులమతాలకు అతీతంగా పేదలకు ప్రభుత్వం ఉచితంగా బట్టలను పంపిణీ చేస్తోందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పీసీసీ కొత్త అధ్యక్షుని కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే...!