తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వగృహంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ శ్రమదానం

ప్ర‌తి ఆదివారం ప‌ది గంట‌ల‌కు.. ప‌ది నిమిషాలు కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రమదానం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి పారిశుద్ధ్య ప‌నులు చేశారు. ఇంట్లో మొక్కలకు పాదు తీసి.. నీళ్లు పెట్టారు. ఇంట్లో నిల్వ నీటిని తొలగించారు.

Minister Errabelli Dayakar Rao Does Sanitizing Works In His Home
స్వగృహంలో శ్రమదానం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

By

Published : Jul 19, 2020, 6:38 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి శ్రమదానం చేశారు. పెరట్లోని మొక్కలకు పాదులు తీసి.. నీళ్లు పెట్టారు. ఇంటి పరిసరాల్లోని నిల్వ నీటిని తొలగించి.. శుభ్ర పరిచారు. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు.

ఇప్పటికే.. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమ‌ల నివార‌ణ‌తో మ‌లేరియా, డెంగీ వంటి అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల‌ను రాకుండా నివారించ‌వ‌చ్చని తెలిపారు.

ఇదీ చూడండి:-'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details