వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం పెరకవేడు గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అత్యవసరమనుకుంటే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిరుపేదలకు సరుకులు అందించి ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా గ్రామాలకు రాకపోకలు మానాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలను కోరారు.
మీకు దండం పెడతా.. దయచేసి బయటకు రావొద్దు : ఎర్రబెల్లి
చేతులెత్తి మొక్కుతున్నా... దయచేసి మీరెవరూ బయటకు రావొద్దంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు దండం పెడుతూ ప్రజలను కోరారు. మరో నెల రోజుల వరకు ఇళ్లు దాటి బయటకు రాకూడదన్నారు.
సరుకులు పంచిన మంత్రి ఎర్రబెల్లి