తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా.. మతం పేరుతో రెచ్చగొడుతోంది: మంత్రి ఎర్రబెల్లి - telangana varthalu

భాజపా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు. ప్రతీది రాజకీయం చేస్తూ తగాదా పెట్టుకునేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. భాజపా నాయకులు పద్ధతి మార్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి హితవు పలికారు. జనగాంలో భాజపా నాయకులపై పోలీసు లాఠీచార్జ్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

భాజపా నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు: ఎర్రబెల్లి
భాజపా నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు: ఎర్రబెల్లి

By

Published : Jan 13, 2021, 3:32 PM IST

భాజపా నేతలు కావాలని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. భాజపా నేతలు, కార్యకర్తలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో డబుల్ బెడ్​రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి.. భాజపా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆలయాల పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

భాజపా శ్రేణులు మితిమీరి ప్రవర్తిస్తున్నాయని... ప్రతీది రాజకీయం చేస్తూ తగాదా పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. భాజపా నాయకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. గిరిజన వర్సిటీ, కాచిగూడ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తామన్న కేంద్రం హామీ.. ఏళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదని మంత్రి విమర్శించారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మి, వరంగల్ భద్రకాళి ఆలయాలకు వెళ్లి రాద్ధాంతం చేయడం సబబు కాదన్న మంత్రి.. పద్ధతి మార్చుకోవాలని కోరారు.

భాజపా నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు: ఎర్రబెల్లి

ఇదీ చదవండి: లాఠీఛార్జ్ చేసిన సీఐపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి

ABOUT THE AUTHOR

...view details