వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై... రైతులకు పట్టా పాసుబుక్కులు అందజేశారు. భూ సమస్యల నుంచి విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి సాదాబైనామా ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో సమస్యలు దాదాపుగా పూర్తైనట్లు వెల్లడించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా రెవెన్యూ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలన్నారు. ఏమైనా భూ సమస్యలు ఉంటే రైతు సమన్వయ సమితి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారాన్ని గీసుకొండ రెవెన్యూ అధికారులు ఛాలెంజింగ్‌గా తీసుకోవాలన్నారు. అందుకు రైతులు కూడా సహకరించాలని కోరారు.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
గీసుకొండ మండల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణా కార్యక్రమం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరై రైతులకు పాసుపుస్తకాలు అందజేశారు.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ