వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వేంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని ల్యాబ్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డా. యాట రోహిత్ రెడ్డి (జనరల్ ఫిజిషియన్), కాసం రోహిత్ రెడ్డి (అర్థో పెడిక్)లను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
"గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి"
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు.
ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి