తెలంగాణ

telangana

తెరాస పాలనలో దేవాలయాలకు మహర్దశ: ఎమ్మెల్యే చల్లా

By

Published : Oct 19, 2020, 11:56 AM IST

రాష్ట్రంలో పురాతన, నూతన ఆలయాల నిర్వహణ, ధూప దీప నైవేద్యాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెరాస పాలనలో రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ చేకూరిందని వెల్లడించారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఎల్గురు రంగంపేట గ్రామంలో నూతన శివాలయ నిర్మాణానికి చల్లా భూమి పూజ చేశారు.

bhumi pooja for lord shiva temple in warangal rural district
తెరాస పాలనలో దేవాలయాలకు మహర్దశ: ఎమ్మెల్యే చల్లా

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస పాలనలో దేవాలయాలకు మహర్దశ చేకూరిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం ఎల్గురు రంగంపేట గ్రామంలో నూతన శివాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ప్రభుత్వం చొరవతో రూ. 50 లక్షల నిధులతో నూతన శివాలయాన్ని నిర్మిస్తున్నట్లు చల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆలయాల అర్చకులకు జీతబత్యాలను సగౌరవంగా అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:లైవ్​ వీడియో: చూస్తుండగానే కర్రతో కొట్టి చంపేశాడు

ABOUT THE AUTHOR

...view details