వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం అశోకనగర్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా ఈ అవగాహన సదస్సును నిర్వహించినట్లు ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తిపంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఖాల ఆయకట్టు రైతులు పాల్గొని వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
విత్తనోత్పత్తి పథకం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సు - రైతుు
రైతులు అధిక దిగుబడులు పొందేలా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన సదస్సును నిర్వహించారు.
విత్తనోత్పత్తి పథకం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సు