వనపర్తి జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామసమీపంలోని వరద కాలువలు ఉద్ధృతంగా పారడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వనపర్తిలో భారీ వర్షం.. నిండుకుండలా చెరువులు, కుంటలు
రాత్రి కురిసిన భారీ వర్షానికి వనపర్తి జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. వరదకాలువలు ఉద్ధృతంగా పారడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వనపర్తిలో భారీ వర్షం
జిల్లా పరిధిలో 119 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. పెబ్బేరు మండలంలో అధికశాతం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
నెలరోజులుగా సమృద్ధిగా కురుస్తున్న వానలతో జిల్లా పరిధిలో ఉన్న చెరువులు, కుంటలన్నీ నిండుకుండలా మారి అలుగు పారుతున్నాయి.