రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఓటేశారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని అన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి - తెలంగాణ వార్తలు
వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి ఓటేశారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారని అన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటేయాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు