తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు... రికార్డులు స్వాధీనం

కొత్త రెవెన్యూ చట్టం దిశగా కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

village-revenue-officers-submitting-records-to-mro-in-parigi-tahsildar-office-at-vikarabad
కొత్త రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు... రెవెన్యూ రికార్డులు స్వాధీనం

By

Published : Sep 7, 2020, 4:48 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో, వీఆర్​ఏలు తమ వద్దనున్న రెవెన్యూ రికార్డులను... ఎమ్మార్వో అశోక్ కుమార్​కు అందించారు. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మేరకు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అశోక్​ కుమార్ తెలిపారు.

కొత్త రెవెన్యూ చట్టంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు సిద్ధమైంది. మంత్రివర్గ సమావేశంలో బిల్లుకు ఆమోదముద్ర వేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చూడండి:దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్‌ ముఖర్జీ: భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details