ఒకటే కేసు నమోదు అయిన ప్రాంతాలలో 14 రోజులకే సీ జోన్లను ఎత్తివేస్తున్నామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సీ జోన్లలో ఆయన పర్యటించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో సీ జోన్ ప్రాంతాలైన మధుకాలనీ, బీటీఎస్, అలంపల్లి, రిక్షాకాలనీలలో ఆయన మున్సిపల్ ఛైర్ పర్సన్‌తో కలిసి పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడారు. మధుకాలనీలో కరోనా బాధితులు స్థానికులు కాకున్నా.. వారు ఇక్కడ లేకపోయినా.. గత 25 రోజులుగా తమను సీ జోన్లో ఎందుకు ఉంచారని కలానీవాసులు ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడా సక్రమంగా అందడం లేదని వారు ఎమ్మెల్యేకు తెలిపారు.
వికారాబాద్‌లోని సీ జోన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన - వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ పట్టణంలోని సీ జోన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒకటే కరోనా కేసు నమోదు అయిన ప్రాంతాలలో 14 రోజులకే సీ జోన్లను ఎత్తివేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వికారాబాద్‌లోని సీ జోన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన
జిల్లాలోని వికారాబాద్‌తో పాటు పరిగి, తాండూరు, కొడంగల్‌లలో ఒక్కొక్క కేసు నమోదైన చోట్లలో 14 రోజులకే సీ జోన్లను ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన చోటా 28 రోజుల పాటు సీ జోన్ అమలులో వుంటుందని ఆయన చెప్పారు. లాక్డౌన్ మాత్రం అంతటా కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు.