వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ షాద్నగర్-పరిగి ప్రధాన రహదారిపై గ్రామస్థులు బైఠాయించారు. పొలాలకు వెళ్లాల్సిన రోడ్డు సరిగా లేదని... ఏ కాలంలోనైనా బురదగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సరిగా లేనందున 8 కి.మీ అదనంగా వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. అధికారులు స్పందించి ఆ దారిలో బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ గ్రామస్థుల నిరసన
రాపోల్ గ్రామంలో రోడ్డు సరిగా లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు వాపోయారు. అదనంగా 8కి.మీ వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
బ్రిడ్జి నిర్మించాలని రాపోల్ గ్రామస్థుల నిరసన
బ్రిడ్జి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎవరూ స్పందించలేదని వాపోయారు. పోలీసులు సంఘటనా స్థలికి వచ్చి... ఆందోళనాకారులను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:మేక మాంసం మరింత ప్రియం.. కిలో రూ. 750