పట్టభద్రులంతా తమ పేరుని ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి కోరారు. 2017 నవంబర్ నాటికి పట్టభద్రలైన వారందరూ అర్హులేనని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3 వార్డుల్లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం రోజు ప్రారంభించారు.
'పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి' - పట్టభద్రుల ఓట్ల నమోదు
పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

'పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి'
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి అర్హులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:రెండ్రోజులు వానలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : కేసీఆర్