తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతోందని తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నూతన వ్యవసాయ విధానంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
కొవిడ్-19తో అన్ని రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతుంటే.. తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితులు లేవని మంత్రి పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి ఆదివారం పది నిమిషాల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు సైతం పాల్గొనాలని తెలిపారు. రానున్న రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వివరించారు.