శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవన్గీ నదీ ఇసుకలో ఏటా కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా శనివారం నిర్వహించిన పోటీల్లో స్థానిక యువకులు సరిహద్దు రాష్ట్రం కర్ణాటకకు చెందిన యువకులతో పోటీపడ్డారు.
బషీరాబాద్‌లో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు - వికారాబాద్ జిల్లా తాజా వార్తలు
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవన్గీ నదీ ఇసుకలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. శనివారం నిర్వహించిన పోటీల్లో సరిహద్దు రాష్ట్రం కర్ణాటకకు చెందిన యువకులు స్థానిక యువకులతో పోటీపడ్డారు.
బషీరాబాద్ పరిధిలో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
కుస్తీ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా వెండి కడియం, రెండో బహుమతిగా నగదును అందించారు.
ఇదీ చదవండి: 'బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి రూ. 10వేల కోట్లు కేటాయించాలి'