తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ బంధం ఇక ఆపేద్దామంటే చంపేశాడు!

మూడేళ్లు గుట్టుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు.. ఆ విషయం మహిళ భర్తకు తెలిసింది. ఆమె ఇక ఆ బంధం ఆపేద్దామని చెప్పింది. కోపోద్రిక్తుడైన వ్యక్తి ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశాడు. వికారాబాద్​ జిల్లా పరిగిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

He killed fornication at pargi vikarabad
వివాహేతర సంబంధం ఆపేద్దామన్నందుకు చంపేశాడు

By

Published : Mar 1, 2020, 6:41 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధి తుంకుల్​గడ్డ శివారులో ఈనెల 27న ఓ మహిళ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. తుంకుల్​గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి తన భార్య పిల్లలను వదిలి ఆ మహిళతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన మహిళ భర్త ఆ పనులు ఆపమని చెప్పాడు.

ఇదే విషయమై ఈనెల 19న మహిళ తన ప్రియుడు రమేష్​తో చెప్పి ఈ సంబంధం ఆపేద్దామని చెప్పింది. విచక్షణ కోల్పోయిన రమేష్ ఇనుప రాడ్డుతో ఆమె తలపై కొట్టి హత్య చేశాడు. ఈనెల 27న తల్లి ఇంట్లో శవమై కుళ్లిన స్థితిలో ఉండడం గమనించిన ఆమె కుమార్తె.. తండ్రికి తెలిపింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా.. భయంతో రమేష్ ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు.

వివాహేతర సంబంధం ఆపేద్దామన్నందుకు చంపేశాడు

ఇదీ చూడండి :స్కూల్లో వినూత్న వేడుక... చిన్నపిల్లలైన తాతయ్యలు, నానమ్మలు

ABOUT THE AUTHOR

...view details