తాండూరు పట్టణ ప్రథమ పౌరురాలైన తాటికొండ స్వప్న ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్, తెజస, సీపీఐ నేతలు ఆరోపించారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఆమెను పదవి నుంచి తొలగించాలి: ప్రతిపక్షనేతలు
వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకున్న ఓటుపై వివాదం చెలరేగుతోంది. ఆ రోజు ఆమె వేసిన ఓటు ఆమె తోటికోడలు భర్తదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
ఆమె ప్రజలను తప్పుదోవ పట్టించారు: ప్రతిపక్షనేతలు
ఎమ్మెల్సీ ఎన్నికల రోజున తాటికొండ స్వప్న తన తోటికోడలు భర్త అశ్విన్ ఓటు వేసిందని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి దొంగఓటు వేసిన ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'ఆ వివాదాలకు 2 వారాల్లో పరిష్కారం చూపాలి'