చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గచ్చిబౌలి ఎస్సై కృష్ణను దుర్భాషలాడారనే ఫిర్యాదుతో కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా సందీప్ రెడ్డి అనే వ్యక్తి డబ్బుతో పట్టుబడ్డాడు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన డబ్బు అని సందీప్ రెడ్డి చెప్పడంతో కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు - konda
కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఎస్సైపై దుర్భాషలాడారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
case-on-konda
కేసుకు సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఆయన ఇంటికి ఎస్సై కృష్ణ వెళ్లారు. ఆ సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి దుర్భాషలాడటంతో పాటు... అవమానించారని ఎస్సై ఫిర్యాదు చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.