వికారాబాద్ జిల్లా పరిగిలో భాజపా నాయకులు కాగడాల ర్యాలీ జరిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ పరిగి బస్టాండ్ నుంచి కొడంగల్ చౌరస్తా వరకు ప్రదర్శన చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ర్యాలీ
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా డిమాండ్ చేసింది. పరిగిలో భాజపా ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ర్యాలీ
తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రకటిస్తామని.. అధికారంలోకి రాగానే మాట తప్పారని భాజపా నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి భాజపా నాయకులు నరసింహ, హరికృష్ణ, పెంటయ్య గుప్తా, రాము యాదవ్, శ్రీశైలం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఉచిత చేపపిల్లల పంపిణీలో అవకతవకలు!