సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక మహిళ మృతి చెందింది. గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన భీమ పొంగు ముత్తమ్మకు అనారోగ్యం కారణంగా మే 14న కుటుంబ సభ్యులు హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు గర్భసంచి ఆపరేషన్ నిర్విహించారు.
వేరే గ్రూపు రక్తం ఎక్కించి ప్రాణం తీశారు.. - వైద్యం వికటించి మహిళ మృతి
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన మహిళను కాటికి పంపారు వైద్యులు. ఆమెకు ఏబీ పాజిటివ్ గ్రూపు రక్తం బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించటం వల్ల వైద్యం వికటించి ఆమె మృతి చెందింది.
వైద్యం వికటించి మహిళ మృతి
ఆ సమయంలో ఆమెకు ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించుటకు బదులు నిర్లక్ష్యంగా మరో గ్రూపు రక్తం ఎక్కించారు. దీనివల్ల ఆమె పరిస్థితి సీరియస్ అయింది. వైద్యుల సూచనమేరకు ఆమెను ఖమ్మం పట్టణంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
వైద్యం వికటించి మహిళ మృతి