తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్లటూరు లిఫ్ట్​కు కావాల్సిన ఆర్థికసాయం అందిస్తాం: ఎమ్మెల్యే సైదిరెడ్డి

రైతులంతా కమిటీలను ఏర్పాటు చేసుకుని లిఫ్ట్​ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. వెల్లటూరు లిఫ్ట్​పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

vellaturu-lift-awareness-program-in-in-suryapeta
వెల్లటూరు లిఫ్ట్​కు కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తాం: ఎమ్మెల్యే సైదిరెడ్డి

By

Published : Jun 18, 2020, 2:10 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో వెల్లటూరు లిఫ్ట్ గురించి వివిధ పార్టీల నాయకులు, రైతులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. వెల్లటూరు లిఫ్ట్ ఏర్పాటుకు రైతులందరూ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రంగాచారి, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, గోపయ్య, నారాయణ రెడ్డి, తొమ్మిది గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సందేహానికి ప్రధాని స్పష్టత

ABOUT THE AUTHOR

...view details