కోతుల దాడిలో వృద్ధునికి గాయాలు - latest news of monkeys attack
కోతుల దాడిలో ఓ వృద్ధుడు గాయాలపాలయ్యాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గానుగుబండ గ్రామంలో చోటుచేసుకుంది.
Breaking News
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో వానరాల దండు విరుచుకుపడింది. గ్రామానికి చెందిన వెంకట్ రాములు అనే వృద్ధునిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. స్థానికులు కోతులను తరిమికొట్టి వృద్ధున్ని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉందని వాటి నియంత్రణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.