సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పశువులకు టీకాలు వేశారు.
'తెలంగాణను గాలికుంటు వ్యాధి రహితంగా మార్చటమే లక్ష్యం' - latest news on minister jagadeeshwar reddy
సూర్యాపేట జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'తెలంగాణను గాలికుంటు వ్యాధి రహితంగా మార్చటమే లక్ష్యం'
పశు వైద్యశాల పనితీరును గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలను అందించాలని వారికి సూచించారు. తెలంగాణను గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ దీపికా యుగంధర్ రావు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.