సూర్యాపేట జిల్లా ప్రజలంతా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్‌ను పరిశీలించారు. అంబులెన్సులు, అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతించాలని పోలీసులకు సూచించారు. ఈ సందర్భంగా తమకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణ పాలుపంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు.
జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలు: ఎస్పీ భాస్కరన్ - సూర్యాపేట జిల్లా జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్‌ను ఆయన పరిశీలించారు.
జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలు: ఎస్పీ భాస్కరన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను రామాపురం చెక్ పోస్ట్ వద్ద నిలిపివేశారు. ఎట్టి పరిస్థితుల్లో వాహనాల రాకపోకల సాగకుండా చూడాలన్నారు.
ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ: స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైన హైదరాబాదీలు