ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2020 ఏప్రిల్ 2న తొలిసారిగా కొవిడ్ కేసు వెలుగుచూసి భయానక పరిస్థితి నెలకొన్న తర్వాత... అంతటా అప్రమత్తత కనిపించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ప్రతి నెలా కేసులు పెరిగినా... గత ఆగస్టు నుంచి వైరస్ తీవ్రత తగ్గడం వల్ల ఏం కాదులేనన్న భావన ఏర్పడింది. కానీ సూర్యాపేట పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 22 మంది నూతన సంవత్సరం రోజు వ్యాధి బారిన పడ్డారు. ఈ ఘటనతో వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదని అర్థమవుతోంది.
మళ్లీ మొదలు...
కరోనా తీవ్రతతో గతేడాది ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించడం వల్ల జనం బయటకు రాలేదు. అప్పట్నుంచి పండుగలు, వేడుకలే కాదు. ఒకరిద్దర్ని ఇంటికి పిలుద్దామన్న కుదరలేదు. ఏప్రిల్ నుంచి మొన్నటి దసరా వరకు ఏడు నెలల పాటు శుభకార్యాలు జరుపుకోలేదు. కానీ దసరా అనంతరం మంచి రోజులు మొదలవడం వల్ల ఇన్నాళ్లూ వేచిచూసిన జనం ఒక్కసారిగా విందులు, వేడుకలు చేస్తున్నారు.
భారీస్థాయిలో...
పెళ్లిళ్లు, పుట్టు వెంట్రుకలు, నూతన వస్త్రాలంకరణ, బారసాల వంటి కార్యక్రమాల్ని మునుపటి రీతిలో చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఇళ్లకే పరిమితమైన శుభకార్యాలు కాస్త ఇపుడు ఫంక్షన్ హాళ్లకు చేరాయి. గత రెండు నెలల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక్క హాలూ ఖాళీగా లేదు. హాజరయ్యే వారి సంఖ్య వంద, రెండు వందల మందికి బదులు అయిదారు వందలు, వెయ్యి దాటి పోయింది.
యాథాస్థితికి...