సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు. నియోజకవర్గంలో నిర్మిస్తున్న రైతువేదికలను త్వరితగతిన పూర్తిచేయాలని, సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు.
'రైతు వేదిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి' - సూర్యాపేట జిల్లా తాజా వార్త
సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి అధికారులకు సూచించారు. రైతువేదికలు కర్షకులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
'రైతు వేదికల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయండి'
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్ నాయక్, మట్టంపల్లి పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కొండానాయక్, తెరాస నాయకులు గుండా బ్రహ్మారెడ్డి, నేరేడుచెర్ల వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి