సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర మిషన్ భగీరథ పైపు లీక్ అయ్యి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్‌పై నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
భగీరథ పైపు లీక్.. కోదాడ-చిల్లేపల్లి రోడ్‌పై ఎగిసిపడుతున్న నీరు - suryapeta latest news
సూర్యాపేట జిల్లా కోదాడ-చిల్లేపల్లి రోడ్డుపై మిషన్ భగీరథ పైపు లీక్ అయ్యి నీరు ఎగిసిపడింది. దానితో వాహనరాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
భగీరథ పైపు లీక్.. కోదాడ-చిల్లేపల్లి రోడ్‌పై ఎగిసిపడుతున్న నీరు
కోదాడ నుంచి చిల్లెపల్లిపై జరుగుతున్న రోడ్ పనుల్లో భాగంగా పైపు లీక్ అవుతుందని స్థానికులు తెలిపారు. గతంలోనూ ఇక్కడ పైపు లీక్ అయ్యిందని.. ఈ విషయం అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
ఇదీ చూడండి:జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా