సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మద్దిరాలకు వెళ్లే రహదారిలో గానుగుబండ క్రాస్ రోడ్ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ నెల రోజులుగా లీకై నీరు వృథాగా పోతోంది. ఫలితంగా పరిసర ప్రాంతంలో పెద్ద మడుగు ఏర్పడి అందులో పశువులు స్నానాలు చేస్తూ సేద తీరుతున్నాయి. భారీగా నీరు వృథాగా పోతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా విషయంలో స్థానికంగా తుంగతుర్తి ప్రాంత ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి లీకేజీల వల్ల మురికి నీరు సరఫరా అవుతూ ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వాపోయారు. వెంటనే పైప్లైనుకు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.
మిషన్ భగీరథ పైప్లైన్ లీక్... పట్టించుకోని అధికారులు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గానుగుబండ క్రాస్ రోడ్ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ లీకై నెల రోజులుగా నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మిషన్ భగీరథ పైప్లైన్ లీక్... పట్టించుకోని అధికారులు