అనారోగ్యంతో మరణించిన సూర్యాపేట జిల్లా చిలుకూరు సర్పంచ్ పత్తిపాక శ్రీనివాస్ యాదవ్ పార్థివ దేహానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నివాళులర్పించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సీపీఐ పార్టీకి చెందిన ఏకైక సర్పంచిగా పేరుపొందిన అనతికాలంలోనే మరణించడం దురదృష్టకరమని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి... మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్లగొండ నలుమూలల నుంచి సీపీఐ పార్టీకి చెందిన అగ్రనాయకులు కుటుంబసభ్యులు శ్రీనివాస్‌యాదవ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. శ్రీనివాస్ మరణం పార్టీకి తీరని లోటని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిలుకూరు సర్పంచ్ మృతికి నేతల సంతాపం - చిలుకూరు సర్పంచ్ మృతికి నేతల సంతాపం...
సూర్యాపేట జిల్లా చిలుకూరు సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్ మృతికి పలువురు నేతలు నివాళులర్పించారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, జిల్లా సీపీఐ నాయకులు అంతిమయాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
LEADERS VISITATION OF CHILKURU SARPANCH DIED